TS News: హైదరాబాద్‌లోని ఆ కాలనీలకు త్వరలోనే తాగునీరు: మంత్రి కేటీఆర్‌

మిషన్‌ భగీరథ పథకం కింద ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని మిగిలివున్న కాలనీలకు త్వరలోనే తాగునీటి సరఫరా

Updated : 07 Oct 2021 14:58 IST

హైదరాబాద్‌: ఒక రోజు విరామం తర్వాత తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభమయ్యాయి. సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మిషన్‌ భగీరథ పథకం కింద ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని మిగిలి ఉన్న కాలనీలకు త్వరలోనే తాగునీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. నగర శివారులో ఉన్న నియోజకవర్గాల్లోని అనేక కాలనీల్లో భూగర్భ మురుగు నీటివ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన శాసనసభలో స్పష్టం చేశారు.

‘‘ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని చాలా కాలనీల్లో 47.5 ఎంఎల్‌డీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను నిర్మించాం. అక్కడక్కడ మిగిలివున్న కాలనీల్లో పనులు చేపట్టడానికి రూ.170 కోట్లు ఖర్చు అవుతుంది. భూగర్భ మురుగు నీటి వ్యవస్థకు ఇంతకుముందే సీఎం కేసీఆర్‌ క్యాబినేట్‌ సమావేశంలో రూ.1200 కోట్లను మంజూరు చేశారు. అందులోభాగంగానే వీటి నిర్మాణం చేపడతాం. నగరంలోని మొత్తం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలంటే రూ.3,700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నాం’’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కేంద్రం మెచ్చుకునే స్థాయిలో పని చేస్తున్నాం: తలసాని

రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మెచ్చుకునే స్థాయిలో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రం తరఫున బ్రాండింగ్‌ చేయనున్నట్లు వివరించారు. సమైఖ్యాంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులను ఆదుకోలేదని తలసాని అసెంబ్లీలో ఆరోపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని