Chidambaram: చమురు ధరల తగ్గింపు.. ఉప ఎన్నికల ఉప ఉత్పత్తి

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడాన్ని భాజపా నేతలు దీపావళి కానుక అంటుంటే.. కాంగ్రెస్ మాత్రం ఉపఎన్నికల ఎఫెక్ట్ అంటూ ఎద్దేవా చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ‘ఇది ఉప ఎన్నికల ఉప ఉత్పత్తి’ అంటూ ట్వీట్ చేశారు. 

Published : 05 Nov 2021 01:40 IST

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎద్దేవా

దిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడాన్ని భాజపా నేతలు దీపావళి కానుక అంటుంటే.. కాంగ్రెస్ మాత్రం ఉపఎన్నికల ఎఫెక్ట్ అంటూ ఎద్దేవా చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ‘ఇది ఉప ఎన్నికల ఉప ఉత్పత్తి’ అంటూ ట్వీట్ చేశారు. 

‘ఇటీవల జరిగిన 30 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితమే ఈ ఉప ఉత్పత్తి. కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అధిక సుంకాలే చమురు ధరల పెరుగుదలకు కారణమన్న మా వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. కేంద్రం దురాశే ఈ అధిక సుంకాలకు కారణం అవుతోంది’ అని విమర్శించారు. 

గత కొంతకాలంగా చమురు ధరల మంటలతో దేశం అల్లాడిపోతోంది. ఈ క్రమంలో నిన్న కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. గురువారం నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా భాజపాకు షాక్ తగిలింది. ఆ ఫలితమే సుంకాల తగ్గింపులో కనిపించదన్న ఛలోక్తులు వినిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని