AP News: ఏపీలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయి: యనమల

ఏపీలో ఆర్థిక అసమానతలు 38శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

Updated : 25 Dec 2021 13:25 IST

అమరావతి: ఏపీలో ఆర్థిక అసమానతలు 38శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సీఎం జగన్‌ పాలనలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై గ్రీన్‌ పేపర్‌ విడుదల చేయాలని యనమల డిమాండ్‌ చేశారు. తిరోగమన వృద్ధి నుంచి రెండంకెల వృద్ధి సాధించేందుకు జగన్‌ ప్రభుత్వ కార్యచరణను బయటపెట్టాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ గాలికొదిలేసి, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజార్చడంపై చర్చ చేసేందుకు గ్రీన్‌పేపర్‌ విడుదల చేయాలని ఓ ప్రకటనలో యనమల డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని