Farmers Protest: రైతులకు మద్దతుగా.. భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.....

Updated : 06 Sep 2021 05:22 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది అన్నదాతలు మన సొంత రక్తమని వరుణ్ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. అన్నదాతల సమస్యల్ని వారి దృక్కోణంలో చూడాలన్న ఆయన.. వారితో తిరిగి చర్చలు జరపాలని కోరారు.

సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మహాపంచాయతీ’కి పెద్ద సంఖ్యలో హాజరైన రైతుల వీడియోను వరుణ్ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది రైతులు ముజఫర్‌నగర్‌లో నిరసన తెలిపారు. వాళ్లు మన సొంత రక్త మాంసాలు. వారితో మర్యాద పూర్వంగా చర్చలు జరపాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. వారితో చర్చలు జరిపి తుది నిర్ణయానికి రావాలి’ అంటూ పేర్కొన్నారు.

అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలతో కేంద్రం ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది. చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తుండగా.. ఈ చట్టాలు రైతులకు తమ ఉత్పత్తులు విక్రయించడానికి కొత్త అవకాశాల్ని కల్పిస్తాయని కేంద్రం నొక్కిచెప్పుతోంది. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని