‘జాతీయ జెండా మీకు అలంకరణ కోసమా?’

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ మండిపడ్డారు. జాతీయ జెండా అలంకరణ కోసం కాదని కేజ్రీవాల్‌కు లేఖ రాశారు....

Published : 29 May 2021 01:38 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ మండిపడ్డారు. జాతీయ జెండా అలంకరణ కోసం కాదని కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. విలేకరుల సమావేశం సమయంలో నిత్యం వెనక ఉండే త్రివర్ణ పతాకాలు సరైన సైజులో లేవని.. జాతీయ జెండా కోడ్‌ను ఉల్లంఘించినట్లే కనిపిస్తోందని ఆరోపించారు. ‘జాతీయ జెండాను అలంకరణ కోసమే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. జెండాలోని తెలుపు రంగు భాగం తగ్గినట్లు.. ఆకుపచ్చ భాగం అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది. హోం మంత్రిత్వ శాఖ పేర్కొన్న జాతీయ జెండా నిబంధనలకు విరుద్ధం. తెలిసి చేసినా.. తెలియక చేసినా ఇలాంటి చర్యలను సహించలేం’ ప్రహ్లాద్‌ పటేల్‌ లేఖలో పేర్కొన్నారు. వేదిక అలంకరణకు జాతీయ జెండాను ఉపయోగించరాదని, ఇది జెండాను అవమానించినట్లేనని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని గౌరవించాలని సూచించారు. ఓ కాపీని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు కూడా పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని