UP Election 2022: కొనసాగుతోన్న మొదటి విడత పోలింగ్‌..

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం మొదటి అంకం ప్రారంభమైంది. మొదటి దశ ఓటింగ్‌లో భాగంగా ఉదయం 9 గంటల వరకు దాదాపు 8 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది.

Published : 10 Feb 2022 11:22 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. మొదటి దశ ఓటింగ్‌లో భాగంగా ఉదయం 9 గంటల వరకు దాదాపు 8 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది.

‘ ఉదయం 9 గంటల వరకు మొదటిదశలో 7.95 శాతం పోలింగ్‌ జరిగింది’ అని ఈసీ ప్రకటించింది. ఆగ్రా, అలీగఢ్‌, బాఘపత్‌, బులంద్‌ షహర్, గౌతమ్ బుద్ధ నగర్‌, ఘజియాబాద్‌, హాపూర్, మథుర, మేరఠ్‌, షామ్లిలో ప్రస్తుతం ఓటింగ్ జరుగుతోంది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలుండగా.. మొదటి దశలో 58 స్థానాల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకొంటున్నారు.  

జయంత్‌ ఓటు వేయకపోవచ్చు!..

ఎస్పీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్‌ చౌధరీ ఓటువేయరని తెలుస్తోంది. ఎన్నికల ర్యాలీ కారణంగా ఆయన ఓటు వేయడం సాధ్యంకాదని పార్టీ కార్యాలయం మీడియాకు వెల్లడించింది. ఆయనకు మథుర ప్రాంతంలో ఓటు ఉంది. 

ఓటేసిన అఖిలేశ్ ప్రత్యర్థి, కేంద్రమంత్రి..

కేంద్రమంత్రి, భాజపా నేత ఎస్పీ సింగ్ బఘేల్ ఆగ్రాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌పై కర్హాల్‌ నుంచి ఆయన బరిలో నిలిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని