UP Elections: అయోధ్య రామ మందిరాన్ని భాజపా కన్నా వేగంగా నిర్మిస్తాం: ఎస్పీ

త్వరలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి. ఇతర పార్టీలు చేసిన విమర్శలకు గట్టిగా బదులిస్తున్నాయి. గతంలో సమాజ్‌వాది నేత అఖిలేశ్‌ యాదవ్‌ అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ భాజపా నేత, కేంద్ర హోం మంత్రి 

Published : 02 Feb 2022 23:40 IST

లఖ్‌నవూ: త్వరలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి. ఇతర పార్టీలు చేసిన విమర్శలకు గట్టిగా బదులిస్తున్నాయి. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ గతంలో భాజపా నేత, కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఎస్పీ ఎంపీ రామ్‌ గోపాల్‌ యాదవ్‌ స్పందించారు. తాము అధికారంలోకి వస్తే భాజపా కంటే వేగంగా రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

‘‘అఖిలేశ్‌ యాదవ్‌ రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ, ఎవరూ ఆపలేరంటూ అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అసలు.. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నది ఎవరు? నిజం చెప్పాలంటే వాళ్లే(భాజపా నేతల్ని ఉద్దేశించి) ఆలయానికి వచ్చే విరాళాలను దారి మళ్లిస్తున్నారు. రామాలయం పరిసరాల్లోని స్థలాలను భాజపా అనుకూల వ్యక్తులు కొనుగోలు చేశారు’’అని భాజపాపై  రామ్‌ గోపాల్‌ యాదవ్‌ విమర్శలు గుప్పించారు. అఖిలేశ్‌ ప్రభుత్వం వచ్చాక ఆలయ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని.. ఉన్నతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే ఆలయ విరాళాల దారి మళ్లింపు ఆగిపోతుందని ఎంపీ రామ్‌ గోపాల్‌ యాదవ్‌ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 10న జరగనుంది. మార్చి 10వ తేదీన పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని