Andhra News: ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. పవన్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు

మూడు వివాహాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ వ్యాఖ్యలున్నాయని పేర్కొంది. ఈ మేరకు మూడు వివాహాలపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది.

Updated : 22 Oct 2022 13:24 IST

అమరావతి: విశాఖ పరిణామాల అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మూడు పెళ్లిళ్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. మూడు వివాహాలపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ మేరకు పవన్‌కు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ‘‘మహిళా లోకానికి పవన్‌ క్షమాపణ చెప్పాలి. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ వ్యాఖ్యలున్నాయి. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం వాడడం సరైంది కాదు. పవన్‌ మాటలు మహిళా భద్రతకు పెనుప్రమాదంగా మారతాయి’’ అని పద్మ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని