Devendra Fadnavis: బాబ్రీ విధ్వంసంలో శివసేన పాత్ర లేదు

మహారాష్ట్రలో భాజపా, శివసేనల నడుమ చర్చనీయాంశంగా మారిన ‘హిందుత్వ’పై ప్రత్యర్థుల వైఖరిని ఎండగడుతూ భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్వరం పెంచారు. 1992లో అయోధ్యలోని బాబ్రీ నిర్మాణాన్ని కూల్చినపుడు

Updated : 02 May 2022 05:13 IST

అప్పుడు నేనక్కడే ఉన్నా : పడణవీస్‌

ముంబయి: మహారాష్ట్రలో భాజపా, శివసేనల నడుమ చర్చనీయాంశంగా మారిన ‘హిందుత్వ’పై ప్రత్యర్థుల వైఖరిని ఎండగడుతూ భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్వరం పెంచారు. 1992లో అయోధ్యలోని బాబ్రీ నిర్మాణాన్ని కూల్చినపుడు తాను అక్కడే ఉన్నానని, శివసేన నేతల్లో ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేరని ఎద్దేవా చేశారు. హనుమాన్‌ చాలీసా చదువుతామన్న ఎంపీ నవనీత్‌ రాణా దంపతులను అరెస్టు చేయించిన ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ రాముడి వైపుందా?.. రావణుడి వైపా! అని ప్రశ్నించారు. ఆదివారం భాజపా ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కరసేవలో పాల్గొన్న తాను 18 రోజులపాటు బదాయూ కేంద్ర కారాగారంలో ఉన్నట్లు తెలిపారు. 1990ల ప్రారంభంలో బాబ్రీ నిర్మాణాన్ని పాక్షికంగా పడగొట్టినపుడు భాజపా నేతలు ఎక్కడున్నారని ఇటీవల శివసేన ప్రశ్నించడంతో.. ఫడణవీస్‌ ‘కరసేవ’ ప్రస్తావన తెచ్చి విపులంగా మాట్లాడారు. ‘హనుమాన్‌ చాలీసా పారాయణం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీరుస్తుందా?’ అని ప్రశ్నించిన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌పైనా విమర్శలు ఎక్కు పెట్టారు. ఇఫ్తార్‌ విందులకు హాజరైనంత మాత్రాన కూడా నిరుద్యోగ సమస్య తీరదని దీటుగా బదులిచ్చారు. విద్యుత్తుకోతలను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే మార్గం ఆలోచిస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని ఫడణవీస్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని