మీ ఎంపీ వ్యాఖ్యలపైనైనా స్పందిస్తారా?

ధాన్యం మాఫియా గురించి వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ స్పందన ఏమిటని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.

Published : 20 May 2022 05:43 IST

ధాన్యం కొనుగోలు వ్యవహారంపై సీఎంకు సోము వీర్రాజు బహిరంగ లేఖ

ఈనాడు, అమరావతి: ధాన్యం మాఫియా గురించి వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ స్పందన ఏమిటని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు గురువారం బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర లేదు. కొనుగోలులో ఘరానా మోసం జరుగుతోంది. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని నేను పదేపదే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ-క్రాప్‌ నమోదులో కుంభకోణం జరుగుతోందని, 17 వేల మంది రైతుల ఖాతాలు చిరునామాలు గల్లంతయ్యాయని స్వయంగా వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. సొంత పార్టీ ఎంపీ వ్యాఖ్యలనయినా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. 75 కిలోల ధాన్యం బస్తాకు రూ.1,455కు బదులు రూ.1,200 కంటే తక్కువ ఇస్తున్నారు. తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ డెల్టాలో లక్షల ఎకరాల్లో వరి పండించిన రైతులకు కోట్లాది రూపాయలు నష్టాన్ని కలిగిస్తోన్న మాఫియా వెనుక ఎవరున్నారో దర్యాప్తు సంస్థలు తేల్చాలి’ అని వీర్రాజు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని