చారిత్రక రాజధాని అమరావతి

చారిత్రక వైభవమున్న అమరావతిని ఆదిలోనే నాశనం చేయొద్దని రాజధాని ప్రాంత రైతులు పేర్కొన్నారు. ఆర్థికంగా, సాంస్కృతికంగా తెలుగు వారి

Published : 21 May 2022 05:59 IST

885వ రోజూ కొనసాగిన రాజధాని రైతుల నిరసన

ఈనాడు డిజిటల్‌, అమరావతి, తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: చారిత్రక వైభవమున్న అమరావతిని ఆదిలోనే నాశనం చేయొద్దని రాజధాని ప్రాంత రైతులు పేర్కొన్నారు. ఆర్థికంగా, సాంస్కృతికంగా తెలుగు వారి ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రాంతం అమరావతిని ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్వీర్యం చేయాలనుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోన్‌రెడ్డి మూడు రాజధానులంటూ మొండిగా ముందుకు వెళుతూ భూములిచ్చిన రైతుల్ని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 885వ రోజు శుక్రవారం కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆశాజ్యోతి అమరావతి అంటూ కృష్ణాయపాలెం శిబిరంలో రైతులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తాడికొండ శిబిరాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని