భగవద్గీత పోటీల్లో పావన కృతికి బంగారు పతకం

మైసూరులోని దత్తపీఠం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి భగవద్గీత పోటీల్లో న్యాయవాది టి.జీవన్‌కుమార్‌, ప్రియాంక దంపతుల కుమార్తె పావన కృతి బంగారు పతకాన్ని సాధించింది. శనివారం

Published : 22 May 2022 05:49 IST

ఈనాడు, అమరావతి: మైసూరులోని దత్తపీఠం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి భగవద్గీత పోటీల్లో న్యాయవాది టి.జీవన్‌కుమార్‌, ప్రియాంక దంపతుల కుమార్తె పావన కృతి బంగారు పతకాన్ని సాధించింది. శనివారం మైసూర్‌లో జరిగిన వేడుకల్లో పావన కృతికి దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. విజయవాడలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ చిన్నారి నాలుగో తరగతి చదువుతోంది. సుమారు ఏడాది పాటు దత్తపీఠం భగవద్గీత శ్లోకాలపై బాలబాలికలకు నిర్వహించిన తర్ఫీదు అనంతరం నిర్వహించిన పోటీల్లో విశ్వవ్యాప్తంగా వేలాది మంది పాల్గొన్నారు. తుది పోటీల్లో దాదాపు వెయ్యి మంది పోటీ పడితే అందులో పావన కృతి బంగారు పతకాన్ని సాధించింది. భగవద్గీతలోని 18 పర్వాలలో నిర్వాహకులు ఒక పదం చెబుతారు. దాని ఆధారంగా చేసుకుని ఆ శ్లోకాలను ఆశువుగా చెప్పడం ద్వారా పోటీల్లో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని