Gay Marriage: ఘనంగా ‘గే’ యువరాజు పెళ్లి..

గుజరాత్‌కు చెందిన యువరాజు మానవేంద్ర సింగ్‌ గోహిల్‌ ఓ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నాడు. 2022 జులై 6న అమెరికాలోని కొలంబస్‌లో డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ ఫొటోలను

Updated : 11 Jul 2022 07:12 IST

గుజరాత్‌కు చెందిన యువరాజు మానవేంద్ర సింగ్‌ గోహిల్‌ ఓ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నాడు. 2022 జులై 6న అమెరికాలోని కొలంబస్‌లో డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ ఫొటోలను విడుదల చేశారు. మానవేంద్ర సింగ్‌, డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు వివాహం చేసుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, ఈ విషయం గురించి బహిరంగంగా ప్రకటించారు. తమ వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌చేశారు. తనను తాను ‘గే’గా ప్రకటించుకున్న మానవేంద్ర సింగ్‌.. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు పొందారు. స్వలింగ సంపర్కుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు.  రాజ్‌పిప్లాలో స్వలింగ సంపర్కుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా రచయిత జనేత్‌ పేరును పెట్టారు. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది స్వలింగ సంపర్కుల ఆశ్రమంగా పేరొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు