Digital Rape: మైనర్‌పై 80ఏళ్ల వృద్ధుడి ‘డిజిటల్‌ రేప్‌’

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో డిజిటల్‌ రేప్‌ కేసు వెలుగుచూసింది. 80 ఏళ్ల వృద్ధుడు తనను 7 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడు మౌరిస్‌ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మౌరిస్‌ పెయింటర్‌గా

Updated : 17 May 2022 07:12 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో డిజిటల్‌ రేప్‌ కేసు వెలుగుచూసింది. 80 ఏళ్ల వృద్ధుడు తనను 7 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడు మౌరిస్‌ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మౌరిస్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అలహాబాద్‌కు చెందిన ఇతడు నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో పని చేసేందుకు ఓ బాలికను పెట్టుకున్నారు. ఏడేళ్లుగా ఆమె ఇక్కడే పనిచేస్తోంది. మౌరిస్‌ రైడర్‌.. తనను పనిలో చేరినప్పటి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో, ఆడియో రికార్డుల రూపంలో అందజేసింది. దీంతో పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డిజిటల్‌ రేప్‌ అభియోగాలు మోపారు.

డిజిటల్‌ రేప్‌ అంటే..

డిజిటల్‌, రేప్‌ రెండు వేర్వేరు పదాలు. డిజిట్‌ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లిష్‌ డిక్షనరీలో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్‌, రేప్‌ కలిపి డిజిటల్‌ రేప్‌ అని పేరు పెట్టారు. డిజిటల్‌ రేప్‌ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వెేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం. ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్‌ రేప్‌ కేసు నమోదవడం ఇది రెండోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని