శ్రీలంకలో ప్రధానికే ఆర్థికశాఖ బాధ్యతలు..

సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో కీలక ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రధాని రణిల్‌ విక్రమసింఘే చేపట్టారు. ఈమేరకు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయనతో బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘే ఈనెల

Updated : 26 May 2022 06:24 IST

సంక్షోభం నుంచి గట్టెక్కించేనా!

కొలంబో: సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో కీలక ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రధాని రణిల్‌ విక్రమసింఘే చేపట్టారు. ఈమేరకు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయనతో బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘే ఈనెల 12న మరోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా కట్టబెట్టారు. తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న శ్రీలంకను ఆర్థికంగా గాడిన పెట్టడానికి విక్రమసింఘే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు శ్రీలంక తగిన విస్తృత ఆర్థిక విధానానికి రూపకల్పన చేస్తే తప్ప కొత్త లేదా స్వల్పకాలిక రుణాలు వంటివేమీ మంజూరు చేసేది లేదని ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పింది. అలాగే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రాజకీయ అశాంతికి కూడా దారితీసింది. గత 40 రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విక్రమసింఘే మీద అతిపెద్ద బాధ్యతే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని