ఆ శాస్త్రవేత్తల కుటుంబాలకు 400 కోట్ల డాలర్లు ఇవ్వాలి: ఇరాన్‌ కోర్టు

ఇటీవలి సంవత్సరాల్లో లక్షిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ అణు శాస్త్రవేత్తల కుటుంబాలకు 400 కోట్ల డాలర్లు చెల్లించాలని ఇరాన్‌లోని కోర్టు.. అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ పరిహారం కోరుతూ ఇరాన్‌ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు

Published : 24 Jun 2022 06:03 IST

టెహ్రాన్‌: ఇటీవలి సంవత్సరాల్లో లక్షిత దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ అణు శాస్త్రవేత్తల కుటుంబాలకు 400 కోట్ల డాలర్లు చెల్లించాలని ఇరాన్‌లోని కోర్టు.. అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ పరిహారం కోరుతూ ఇరాన్‌ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంతవరకు అమలు అవుతుందో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇరాన్‌లో జప్తు చేయడానికి అమెరికాకు ఆస్తులేమీ లేవు. అయినప్పటికీ ఇరాన్‌ ప్రభుత్వ ఫిర్యాదులను సమీక్షించడానికి పూనుకున్న ఇక్కడి న్యాయస్థానం అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో సహా 37మంది అమెరికా మాజీ ఉన్నతోద్యోగులకు సమన్లు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని