హిమాలయాల్లో అరుదైన మాంసాహార మొక్క

పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఒక అరుదైన మాంసాహార మొక్క తొలిసారిగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌ అటవీశాఖకు చెందిన పరిశోధక బృందం దీన్ని గుర్తించింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న మండల్‌ లోయలో

Published : 26 Jun 2022 05:39 IST

దేహ్రాదూన్‌: పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఒక అరుదైన మాంసాహార మొక్క తొలిసారిగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌ అటవీశాఖకు చెందిన పరిశోధక బృందం దీన్ని గుర్తించింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న మండల్‌ లోయలో ఇది కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం ప్రతిష్టాత్మకమైన ‘జర్నల్‌ ఆఫ్‌ జపనీస్‌ బోటనీ’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘ఉట్రికులేరియా ఫుర్సెలాటా’. ఇది తన ఆకృతుల సాయంలో కీటకాలు, దోమల లార్వాలు, చిన్నపాటి కప్పలను ఒడిసిపట్టి, స్వాహా చేస్తుంది. వాక్యూమ్‌ ప్రయోగించడం ద్వారా వీటిని తనలోకి లాగేసుకుంటుంది. కిరణజన్యసంయోగ క్రియ ఆధారంగా జీవించే మొక్కలతో పోలిస్తే మాంసాహార చెట్ల తీరు భిన్నంగా ఉంటుంది. ఇవి పెద్దగా పోషకాలు లేని నేలలో, నీళ్లలో కనిపిస్తుంటాయి. ఈ మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని