Nikah halala: ‘హలాలా’కు మాజీ భార్య నో.. ముఖంపై యాసిడ్‌ పోసిన భర్త

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నయ్యతో హలాలాకు నిరాకరించిందని మాజీ భార్యపై యాసిడ్‌ దాడి చేశాడు. ఓ భర్త. బరేలీ జిల్లాకు చెందిన ఇషాక్‌.. 11 ఏళ్ల క్రితం నస్రీన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహ బంధానికి

Updated : 30 Jun 2022 07:36 IST

త్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నయ్యతో హలాలాకు నిరాకరించిందని మాజీ భార్యపై యాసిడ్‌ దాడి చేశాడు. ఓ భర్త. బరేలీ జిల్లాకు చెందిన ఇషాక్‌.. 11 ఏళ్ల క్రితం నస్రీన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇటీవలే అతడి చిన్న కుమార్తెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్యకు ముమ్మారు తలాక్‌ చెప్పాడు. వెంటనే బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తపై ఎలాంటి కేసులు పెట్టలేదు. మరోవైపు, నస్రీన్‌ను మళ్లీ భార్యగా స్వీకరిస్తానని ఇషాక్‌ సందేశాలు పంపాడు. అదే సమయంలో ఓ షరతు పెట్టాడు. మళ్లీ తనతో కలిసి జీవించాలంటే తన అన్నయ్యతో హలాలా చేసుకోవాలని కోరాడు. అందుకు బాధితురాలు అంగీకరించలేదు. ఇటీవలే ఆమెను కలవడానికి వెళ్లిన ఇషాక్‌.. హలాలా విషయమై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె పూర్తిగా నిరాకరించడంతో.. ముఖంపై యాసిడ్‌ పోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

హలాలా అంటే ఏంటి?

విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళ మళ్లీ భర్తను పెళ్లి చేసుకోవాలంటే దానికంటే ముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అతడికి విడాకులు ఇవ్వడమో లేదంటే అతడు మరణించే వరకు ఉండడమో చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆమె మళ్లీ తన భర్తను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని