శిందేతో సయోధ్య కుదుర్చుకుందాం!

తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేతో తలెత్తిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని శివసేన ఎంపీలు తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచించినట్లు తెలిసింది. శివసేనకు లోక్‌సభలో 19

Published : 02 Jul 2022 06:34 IST

ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచించిన శివసేన ఎంపీలు

దిల్లీ: తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేతో తలెత్తిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని శివసేన ఎంపీలు తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచించినట్లు తెలిసింది. శివసేనకు లోక్‌సభలో 19 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలున్నారు. శివసేన పార్లమెంటు సభ్యుల్లో 12మంది తమతో సంప్రదింపుల్లో ఉన్నారని భాజపా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ముంబయిలో తమ పార్టీ ఎంపీలతో ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏక్‌నాథ్‌ శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే, ఈడీ పరిశీలనలో ఉన్న భవనా గావ్లీ, ఠానే ఎంపీ రాజన్‌ విఛారే మినహా శివసేన లోక్‌సభ ఎంపీలు అందరూ హాజరయ్యారు. పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా ఏక్‌నాథ్‌ శిందే వర్గంతో సయోధ్య కుదుర్చుకుందామని వారు సూచించారని సమాచారం. అయితే, ఠాక్రే స్పందన ఏమిటో తెలియరాలేదు.  ఎమ్మెల్యేల తిరుగుబాటు ప్రభావం తమ ఎంపీలపై ఏ మాత్రం లేదని శివసేన పార్లమెంటరీ పార్టీ నేత వినాయక్‌ రౌత్‌ తెలిపారు. ఠాక్రేతో ఉంటానని ఉస్మానాబాద్‌ ఎంపీ ఒమ్రాజే నింబాల్కర్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని