త్వరలో జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు

ఓటర్ల జాబితా సవరణ ముగిసిన జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తెలిపారు. రాష్ట్ర హోదా కూడా తగిన సమయంలో లభిస్తుందని హామీ ఇచ్చారు. శనివారం

Published : 04 Jul 2022 06:17 IST

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా

శ్రీనగర్‌: ఓటర్ల జాబితా సవరణ ముగిసిన జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తెలిపారు. రాష్ట్ర హోదా కూడా తగిన సమయంలో లభిస్తుందని హామీ ఇచ్చారు. శనివారం రాత్రి ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కరణ్‌సింగ్‌కు జరిగిన అభినందన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్యం భారత ఆత్మ. జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు పార్లమెంట్లో ఎన్నోసార్లు చెప్పారు’’ అని సిన్హా పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిందని, ఎన్నికల జాబితా సవరణ పనులూ ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ‘‘దీని తర్వాత కచ్చితంగా ఎన్నికలు ఉంటాయి’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని