Vladimir Putin: పుతిన్‌కు వ్యతిరేకంగా అతిపెద్ద కూటమి..

క్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా.. వీలయినంత పెద్ద కూటమి ఏర్పాటు కావాలని బ్రిటన్‌ బుధవారం పిలుపునిచ్చింది. ఇందులో భారత్‌ కూడా

Updated : 03 Mar 2022 11:47 IST

భారత్‌ సహా ప్రపంచ దేశాలకు బ్రిటన్‌ పిలుపు

లండన్‌: ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా.. వీలయినంత పెద్ద కూటమి ఏర్పాటు కావాలని బ్రిటన్‌ బుధవారం పిలుపునిచ్చింది. ఇందులో భారత్‌ కూడా ఉండాలని పేర్కొంది. ఈమేరకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అధికార ప్రతినిధి ‘పీటీఐ’ వార్తాసంస్థతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ నగరాలపై పుతిన్‌ దాడులను విశ్వవ్యాప్తంగా ఖండించాలంటూ.. ప్రపంచ నేతలను కోరుతున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి, భారత ప్రధాని నరేంద్ర మోదీతో త్వరలోనే ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉందని జాన్సన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని దేశాలూ రష్యా అధ్యక్షుడికి సాధ్యమైనంత స్పష్టమైన సందేశం పంపించేలా ఏకతాటిపైకి రావాలన్నదే బ్రిటన్‌ లక్ష్యమని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంపై దురాక్రమణకు పాల్పడటాన్ని ఖండించడానికి అన్ని దేశాలూ అంగీకరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా భారత్‌-బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అధికారుల మధ్య రెండో విడత చర్చలు వచ్చే వారం నుంచి జరుగుతాయని బ్రిటన్‌ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని