Omicron: ఒమిక్రాన్‌తో బాలలకు శ్వాసకోశ వ్యాధి

ఒమిక్రాన్‌ బారినపడిన బాలల్లో క్రూప్‌ అనే శ్వాసకోశ వ్యాధి వస్తున్నట్లు ఇక్కడి పిల్లల వైద్యశాల తాజా

Published : 17 Mar 2022 09:48 IST

బోస్టన్‌: ఒమిక్రాన్‌ బారినపడిన బాలల్లో క్రూప్‌ అనే శ్వాసకోశ వ్యాధి వస్తున్నట్లు ఇక్కడి పిల్లల వైద్యశాల తాజా పరిశోధనలో తేలింది. ఈ వ్యాధి బారినపడిన పిల్లలు ఖళ్లు ఖళ్లని దగ్గుతారు. ఊపిరాడక బలంగా శ్వాస తీసుకోవలసి వస్తుంది. ఒమిక్రాన్‌ వైరస్‌ శ్వాసకోశంలో ఎగువ భాగానికి సోకుతుందని జంతువులపై జరిగిన పరిశోధనల్లో వెల్లడైన సంగతి ఇక్కడ గమనార్హం. కొవిడ్‌ 19తోపాటు క్రూప్‌ బారిన పడిన పిల్లలందరి వయసు రెండేళ్లలోపే. వారిలో దాదాపు 72 శాతం బాలురే. మొత్తం 75 మంది బాలలకు కొవిడ్‌ 19తో మిళితమైన క్రూప్‌ వ్యాధి వచ్చినా, వారిలో ఏ ఒక్కరూ మరణించలేదు. క్రూప్‌ వచ్చిన బాలల్లో 9 మంది ఆస్పత్రిలో చేరవలసి రాగా, వారిలో నలుగురు ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చింది. 97 శాతం మందికి డెక్సామిథేసోన్‌ మందుతో చికిత్స చేశారు. ఆస్పత్రి చేరికలు ఎక్కువగానే ఉన్నా అత్యధిక బాలలకు డెక్సామిథేసోన్‌తో అవుట్‌ పేషంట్లుగా చికిత్స చేసి ఇంటికి పంపారు. అయితే, డెక్సామిథేసోన్‌ మందును ఎక్కువ మోతాదుల్లో వాడవలసి వచ్చింది. మొత్తం మీద ఇతర వైరస్‌లకన్నా కొవిడ్‌ 19 వైరస్‌ వల్ల క్రూప్‌ వ్యాధి తీవ్రత పెరుగుతుందని నిర్ధరణ అయింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని