మూడేళ్ల తర్వాత.. మళ్లీ అమర్‌నాథ్‌ యాత్ర

హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్‌లో గుహలో వెలసిన అమర్‌నాథ్‌ సందర్శన యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. 43 రోజులపాటు సాగే ఈ యాత్రకు శ్రీ అమర్‌నాథ్‌ మందిర బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన

Published : 30 Jun 2022 06:18 IST

శ్రీనగర్‌: హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్‌లో గుహలో వెలసిన అమర్‌నాథ్‌ సందర్శన యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. 43 రోజులపాటు సాగే ఈ యాత్రకు శ్రీ అమర్‌నాథ్‌ మందిర బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని సందర్శించేందుకు భక్తులు తరలివస్తారు. ‘ఆర్టికల్‌ 370 రద్దు’, కొవిడ్‌ వంటి కారణాలతో మూడేళ్ల విరామానంతరం జరుగుతున్న యాత్ర కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా బుధవారం ఉదయం జెండా ఊపి, జమ్మూ బేస్‌క్యాంపు నుంచి యాత్రికుల తొలి బృందాన్ని స్వాగతించారు. 4,890 మంది భక్తులతో కూడిన ఈ బృందం 176 చిన్నా పెద్ద వాహనాల్లో భగవతి నగర్‌ బేస్‌క్యాంపు నుంచి కశ్మీర్‌ లోయకు బయలుదేరింది. యాత్రికులు తమ వెంట ఆధార్‌ కార్డు లేదా మరేదైనా బయోమెట్రిక్‌ పరిశీలక ధ్రువపత్రం తీసుకురావాలని బోర్డు కోరింది. ఆగస్టు 11న రక్షాబంధన్‌తో ఈ యాత్ర ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని