Amarnath yatra: సైనికుల సాహసం.. 4 గంటల్లోనే వంతెన నిర్మాణం

రెండేళ్ల తర్వాత వైభవంగా జరుగుతున్న అమర్‌నాథ్‌ యాత్రలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా సైనికులు బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా కొండచరియలు విరిగి కొట్టుకుపోయిన

Updated : 04 Jul 2022 10:47 IST

రెండేళ్ల తర్వాత వైభవంగా జరుగుతున్న అమర్‌నాథ్‌ యాత్రలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా సైనికులు బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా కొండచరియలు విరిగి కొట్టుకుపోయిన బల్తాల్‌ వంతెనను 4 గంటల్లోనే పునరుద్ధరించారు. ఇటీవలే యాత్ర మార్గంలోని బల్తాల్‌ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీమాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది. వంతెన కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్‌ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త వంతెనను అందుబాటులోకి తెచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని