National News: యూపీలో తామ్రయుగ ఆయుధాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రీస్తుపూర్వం 1600-2000 కాలానికి చెందిన రాగితో తయారుచేసిన ఆయుధాలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు బయటపడ్డాయి. మైన్‌పురీ జిల్లాలోని కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈ నెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని

Updated : 26 Jun 2022 09:24 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రీస్తుపూర్వం 1600-2000 కాలానికి చెందిన రాగితో తయారుచేసిన ఆయుధాలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు బయటపడ్డాయి. మైన్‌పురీ జిల్లాలోని కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈ నెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదునుచేస్తుండగా పురాతన ఆయుధాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు రంగంలోకి దిగారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఏఎస్‌ఐ అధికారులు వచ్చి ఆయుధాలను పరిశీలించారు. వారంపాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేశారు. రాగి నిధులతోపాటు, కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు. గణేశ్‌పురలో 77 రాగి వస్తువులు లభించాయని ఏఎస్‌ఐ ఆగ్రా సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌ తెలిపారు. ఇందులో 16 మానవ బొమ్మలు ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో 3 రకాల కత్తులతోపాటు ఈటెలు లభ్యమైనట్లు వివరించారు. ‘‘ప్రస్తుతం దొరికిన రాగి వస్తువులు, ఆయుధాలు చాల్కోలిథిక్‌ లేదా తామ్రయుగం కాలం నాటివి. 3,800-4,000 ఏళ్ల పాతవి. ఆయుధాలన్నీ స్వచ్ఛమైన రాగితో తయారయ్యాయి’’ అని రాజ్‌కుమార్‌ పటేల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని