ధోనీని ఔట్‌ చేశానా? నమ్మలేకపోతున్నా..

ధోనీ ఆటను వీక్షించేందుకు చెపాక్‌ స్టాండ్స్‌లో కూర్చున్న తానే అతడి వికెట్‌ తీయడాన్ని నమ్మలేకపోతున్నానని కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి అన్నాడు. ఇందుకోసం ఎన్నో పెద్ద కలలు కన్నానని వివరించాడు. ధోనీసేనతో పోరులో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన..

Published : 09 Oct 2020 01:12 IST

కోల్‌కతా  మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి

అబుదాబి: ధోనీ ఆటను వీక్షించేందుకు చెపాక్‌ స్టాండ్స్‌లో కూర్చున్న తానే అతడి వికెట్‌ తీయడాన్ని నమ్మలేకపోతున్నానని కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి అన్నాడు. ఇందుకోసం ఎన్నో పెద్ద కలలు కన్నానని వివరించాడు. ధోనీసేనతో పోరులో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన రాహుల్‌ త్రిపాఠి (81)తో కలిసి అతడు మాట్లాడాడు.

‘ధోనీని చూసేందుకు మూడేళ్ల క్రితం చెపాక్‌ స్టాండ్స్‌కు వచ్చేవాడిని. అభిమానులతో కలిసి కూర్చొనేవాడిని. కేవలం మహీ బ్యాటింగ్‌ను వీక్షించేందుకే అక్కడికి వచ్చేవాడిని. అలాంటిది ఇప్పుడు అతడికే బౌలింగ్‌ చేస్తున్నాను. నిజంగా దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. అబుదాబి వికెట్‌ ఫ్లాట్‌గా అనిపించింది. బంతి సైతం ఎక్కువగా టర్న్‌ అవ్వడం లేదు. అందుకే దాన్ని 180 పరుగుల వికెట్‌గా భావించాను. మహీ భాయ్‌ బాగా ఆడుతున్నాడు. మంచి లెంగ్త్‌లో బంతిని పిచ్‌ అయ్యేలా చేస్తే వికెట్‌ దొరకొచ్చేమో అనిపించింది. అదృష్టవశాత్తూ బంతిని బాగా వేశాను. మ్యాచ్‌ ముగిశాక ధోనీ సర్‌తో ఒక చిత్రం తీసుకున్నాను’ అని చక్రవర్తి ఆనందం వ్యక్తం చేశాడు.

తనకు కూడా ధోనీతో ఫ్యాన్‌బాయ్‌ సందర్భం వచ్చిందని రాహుల్‌ త్రిపాఠి అన్నాడు. పుణెకు ఆడుతున్నప్పుడు తొలిసారి అతడిని చూసి ఉద్వేగానికి గురయ్యానని పేర్కొన్నాడు. ‘నువ్విప్పుడు అతడితో కలిసి చిత్రం తీసుకున్నావు. ఎందుకంటే మనందరికీ ఆయన హీరో అని నాకు తెలుసు’ అని తెలిపాడు. రెండేళ్లు లీగులో ఆడిన పుణె రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ సీజన్‌లో త్రిపాఠి ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడికి మహీ అండ దొరకడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని