ధోనీని ఔట్ చేశానా? నమ్మలేకపోతున్నా..
ధోనీ ఆటను వీక్షించేందుకు చెపాక్ స్టాండ్స్‌లో కూర్చున్న తానే అతడి వికెట్ తీయడాన్ని నమ్మలేకపోతున్నానని కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. ఇందుకోసం ఎన్నో పెద్ద కలలు కన్నానని వివరించాడు. ధోనీసేనతో పోరులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన..
కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
అబుదాబి: ధోనీ ఆటను వీక్షించేందుకు చెపాక్ స్టాండ్స్‌లో కూర్చున్న తానే అతడి వికెట్ తీయడాన్ని నమ్మలేకపోతున్నానని కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. ఇందుకోసం ఎన్నో పెద్ద కలలు కన్నానని వివరించాడు. ధోనీసేనతో పోరులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన రాహుల్ త్రిపాఠి (81)తో కలిసి అతడు మాట్లాడాడు.
‘ధోనీని చూసేందుకు మూడేళ్ల క్రితం చెపాక్ స్టాండ్స్‌కు వచ్చేవాడిని. అభిమానులతో కలిసి కూర్చొనేవాడిని. కేవలం మహీ బ్యాటింగ్‌ను వీక్షించేందుకే అక్కడికి వచ్చేవాడిని. అలాంటిది ఇప్పుడు అతడికే బౌలింగ్ చేస్తున్నాను. నిజంగా దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. అబుదాబి వికెట్ ఫ్లాట్‌గా అనిపించింది. బంతి సైతం ఎక్కువగా టర్న్ అవ్వడం లేదు. అందుకే దాన్ని 180 పరుగుల వికెట్‌గా భావించాను. మహీ భాయ్ బాగా ఆడుతున్నాడు. మంచి లెంగ్త్‌లో బంతిని పిచ్ అయ్యేలా చేస్తే వికెట్ దొరకొచ్చేమో అనిపించింది. అదృష్టవశాత్తూ బంతిని బాగా వేశాను. మ్యాచ్ ముగిశాక ధోనీ సర్‌తో ఒక చిత్రం తీసుకున్నాను’ అని చక్రవర్తి ఆనందం వ్యక్తం చేశాడు.
తనకు కూడా ధోనీతో ఫ్యాన్‌బాయ్ సందర్భం వచ్చిందని రాహుల్ త్రిపాఠి అన్నాడు. పుణెకు ఆడుతున్నప్పుడు తొలిసారి అతడిని చూసి ఉద్వేగానికి గురయ్యానని పేర్కొన్నాడు. ‘నువ్విప్పుడు అతడితో కలిసి చిత్రం తీసుకున్నావు. ఎందుకంటే మనందరికీ ఆయన హీరో అని నాకు తెలుసు’ అని తెలిపాడు. రెండేళ్లు లీగులో ఆడిన పుణె రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ సీజన్లో త్రిపాఠి ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడికి మహీ అండ దొరకడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్‌రైజర్స్‌పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్‌లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్‌కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్‌లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్‌లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్‌స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్‌గా సీరియస్‌గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.