రోహిత్‌కు అతడే సరైన జోడీ: గావస్కర్‌

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించినా టీమిండియాకు ఓపెనింగ్ సమస్య వెంటాడుతూనే ఉంది. తొలి టెస్టులో పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. అయితే మెల్‌బోర్న్

Published : 31 Dec 2020 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్: బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించినా టీమిండియాకు ఓపెనింగ్ సమస్య వెంటాడుతూనే ఉంది. తొలి టెస్టులో పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. అయితే మెల్‌బోర్న్ టెస్టులో మయాంక్ అగర్వాల్‌ కూడా నిరాశపరిచాడు. కనీసం రెండంకెల స్కోరు అందుకోలేకపోయాడు. అయితే మయాంక్‌కు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్‌ మద్దతుగా నిలిచాడు. గతేడాదిన్నర నిలకడగా పరుగులు సాధించిన అతడికి మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు. సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టులో రోహిత్‌కు జోడీగా మయాంక్‌ బరిలోకి దిగాలని అన్నాడు.

‘‘గత ఏడాదిన్నర మయాంక్ అద్భుతంగా ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అతడి ప్రదర్శన చూడండి. గొప్పగా ఆడాడు. అయితే ఇది కఠిన సమయం. ఆస్ట్రేలియా పిచ్‌లపై ప్రతి బ్యాట్స్‌మన్‌ ఇబ్బందిపడతాడు. మయాంక్‌కు మరో అవకాశం ఇవ్వాలి. రోహిత్-మయాంక్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగాలి. అయితే మయాంక్ తన ఆటతీరును కాస్త మెరుగుపర్చుకోవాలి. ఒకానొక సందర్భంలో అతడు టెస్టుల్లో భారత్ తరఫున వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచేలా దూసుకెళ్లాడు. కానీ గొప్ప పేసర్లను ఎదుర్కోవడంతో సాధించలేకపోయాడు’’ అని అన్నాడు.

కాగా, మయాంక్.. టెస్టుల్లో భారత్ తరఫున వేగంగా వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో వినోద్ కాంబ్లి, పుజారా ఉన్నారు. అయితే టీమిండియాకు ఓపెనర్లుగా శుభ్‌మన్‌ గిల్, కేఎల్ రాహుల్‌ కూడా అందుబాటులో ఉన్నారు. అరంగేట్రంలోనే గిల్ 45, 35* పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే. మరోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కలేదు. రోహిత్ క్వారంటైన్‌ను ముగించుకుని నేడు జట్టులో చేరాడు. మరి, జనవరి 7న సిడ్నీ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్టులో ఓపెనర్లుగా ఎవరికి అవకాశం ఇస్తారో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

ఇదీ చదవండి

రోహిత్ వచ్చేశాడు! మరి జట్టులో మార్పులేంటి?

ఇది భారత్‌.. ఎవరికీ తలవంచదు: గావస్కర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని