Tokyo Olympics: యాంటీ సెక్స్‌ బెడ్స్‌.. అవాస్తవం!

ఒలింపిక్స్‌ ఆటగాళ్ల గదుల్లో శృంగారం కట్టడి కోసం తక్కువ సామర్థ్యమున్న మంచాలను ఏర్పాటు చేశారంటూ వస్తున్న వార్తల్ని ఒలింపిక్స్‌ నిర్వహకులు ఖండించారు. అట్టలతో చేసినప్పటికీ.. అవి దృఢంగా...

Updated : 19 Oct 2022 11:34 IST

స్పష్టం చేసిన నిర్వాహకులు

టోక్యో: శృంగారం కట్టడి కోసం ఒలింపిక్స్‌ ఆటగాళ్ల గదుల్లో తక్కువ సామర్థ్యమున్న మంచాలను ఏర్పాటు చేశారంటూ వస్తున్న వార్తల్ని ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఖండించారు. అట్టలతో చేసినప్పటికీ.. అవి దృఢంగానే ఉంటాయని స్పష్టం చేశారు. 200 కిలోల వరకు బరువును మోయగలవని తెలిపారు. ఆ మేరకు ముందే అన్ని రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు అట్టలతో(కార్డ్‌బోర్డుతో) చేసిన మంచాలైనప్పటికీ.. దృఢంగా ఉన్నాయంటూ ఐర్లండ్‌కు చెందిన జిమ్నాస్టిక్స్ ఆటగాడు రిస్‌ మెక్‌క్లెనఘన్‌ తన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. వాటిపై ఎగురుతూ ఆ మంచాల సామర్థ్యాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు. ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. దీనికి ఒలింపిక్స్‌ నిర్వాహకులు..  రిస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా.. శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను సిద్ధం చేశారంటూ అమెరికాకు చెందిన ఓ ఆటగాడు ట్వీట్‌ చేయడంతో ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించి దీనిపై స్పష్టతనిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని