AUS vs SL: నిశాంక, కుశాల్ పెరీరా అర్ధ శతకాలు.. భారీ స్కోరు దిశగా శ్రీలంక

ప్రపంచ కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు లఖ్‌నవూ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలనే ఇరుజట్లు భావిస్తున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది.

Updated : 16 Oct 2023 16:20 IST

లఖ్‌నవూ: ప్రపంచ కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు లఖ్‌నవూ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టాలనే ఇరుజట్లు భావిస్తున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. 27 ఓవర్లు ముగిసేసరికి లంక రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (78; 82 బంతుల్లో 12 ఫోర్లు), పాథుమ్ నిశాంక (61; 67 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. కుశాల్‌ మెండిస్ (8*), సదీరా సమరవిక్రమ (1*) క్రీజులో ఉన్నారు. 

శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించారు. నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా వరుసగా రెండు ఫోర్లు బాదాడు. జంపా బౌలింగ్‌లో నిశాంక కూడా రెండు బౌండరీలు రాబట్టాడు. ఈ క్రమంలోనే 18 ఓవర్లకు స్కోరు 100 దాటగా.. ఇద్దరూ అర్ధ శతకాలకు చేరువయ్యారు. స్టాయినిస్‌ బౌలింగ్‌లో ఫోర్ బాది పెరీరా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. మ్యాక్స్‌వెల్ వేసిన తర్వాతి ఓవర్‌లో నిశాంక హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. కొద్దిసేపటికే  కమిన్స్‌ బౌలింగ్‌లో నిశాంక పెవిలియన్‌కు పంపాడు. అతడు డేవిడ్‌ వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత దూకుడు పెంచిన పెరీరాను కూడా కమిన్సే ఔట్‌ చేశాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని