మిచెల్‌ స్టార్క్‌..ప్రపంచంలోనే గొప్ప వైట్‌బాల్‌ బౌలర్‌: దినేశ్‌ కార్తిక్‌

ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌(Mitchel Starc)పై భారత బ్యాటర్‌  దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik) ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే గొప్ప వైట్‌బాల్‌ బౌలర్‌ అని కొనియాడాడు.

Published : 20 Mar 2023 17:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌(Mitchel Starc)పై భారత బ్యాటర్‌  దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik) ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే గొప్ప వైట్‌బాల్‌ బౌలర్‌ అని కొనియాడాడు. ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో స్టార్క్‌ 5 వికెట్లు తీసి ఆసీస్‌ జట్టుకు విజయాన్ని చేరువ చేసిన విషయం తెలిసిందే.

‘‘ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ‘స్టార్క్‌’ ప్రపంచంలోనే గొప్ప వైట్‌బాల్‌ బౌలర్‌ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్యాటర్‌గా ఎవరున్నాసరే అతనిని స్టార్క్‌ మొదటి బంతికే పెవిలియన్‌కు చేర్చే ప్రయత్నం చేస్తాడు. అతడు అత్యంత నాణ్యమైన బౌలర్‌. అతడి బంతుల్ని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. నాణ్యమైన ఎడమచేతి పేసర్లను ఎదుర్కొనే సమయంలో బ్యాటర్లు ఆచితూచి ఆడాలి. పాకిస్థాన్‌ ఆటగాడు షాహీన్‌ అఫ్రిది, న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, ఆస్ట్రేలియా బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ల ఆటతీరు భిన్నంగా ఉంటుంది. వారు అత్యంత ప్రతిభ గల పేసర్లు’’ అని పేర్కొన్నాడు.  భారత టీ20 స్టార్‌ సూర్యకుమార్‌యాదవ్‌కు మద్దతు పలికాడు డీకే. స్టార్క్‌ చేతిలో రెండు వన్డేల్లోనూ సూర్యకుమార్‌ యాదవ్‌  డకౌట్‌ అయ్యాడు. అది సాధారణంగా ఎవరికైనా జరుగుతుందని డీకే అన్నాడు.  ‘‘సూర్యకుమార్‌ యాదవ్‌ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోవట్లేదని అందరు భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. మొదటి బంతికే పెవిలియన్‌ చేరాడంటే అతడు క్రీజులో ఇంకా కుదురకోకముందే అవుట్ అయ్యాడని అర్థం. అది సాధారణంగా ఎవరికైనా జరుగుతుంది’’ అని వివరించాడు.

వైజాగ్‌లోని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. సిరీస్‌ విజేతను తేల్చే చివరి వన్డే చెన్నైలో  మార్చి 22న జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు