SKY - Smriti: ఉత్తమ టీ20 క్రికెటర్ల రేసులో సూర్య, స్మృతి

సూర్యకుమార్‌ యాదవ్‌, స్మృతి మంధాన ఈ ఏడాది ఉత్తమ టీ20 క్రికెటర్ల రేసులో నిలిచారు. గురువారం ఐసీసీ ప్రతిపాదించిన పురుషులు, మహిళల జాబితాలో ఈ భారత స్టార్లు చోటు దక్కించుకున్నారు.

Updated : 30 Dec 2022 08:03 IST

దుబాయ్‌: సూర్యకుమార్‌ యాదవ్‌, స్మృతి మంధాన ఈ ఏడాది ఉత్తమ టీ20 క్రికెటర్ల రేసులో నిలిచారు. గురువారం ఐసీసీ ప్రతిపాదించిన పురుషులు, మహిళల జాబితాలో ఈ భారత స్టార్లు చోటు దక్కించుకున్నారు. పురుషుల్లో సూర్యతో పాటు సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌), సికందర్‌ రజా (జింబాబ్వే) కూడా ఉన్నారు. మహిళల్లో స్మృతికి తోడు నిడాదార్‌ (పాకిస్థాన్‌), సోఫి డివైన్‌ (న్యూజిలాండ్‌), తాలియా మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా) పోటీపడుతున్నారు. ఈ సీజన్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్‌ (1164) టీ20ల్లో ఒక ఏడాదిలో 1000 పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా ఘనత సాధించాడు. 187.43 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించిన అతడు 68 సిక్స్‌లు బాదాడు.  మరోవైపు  భారత మహిళల క్రికెట్లో స్థిరంగా రాణిస్తోన్న స్మృతి ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో ఇంగ్లాండ్‌పై 23 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసింది.   ఈ సీజన్లోనే స్మృతి టీ20 ఫార్మాట్లో 2500  పరుగుల మైలురాయిని కూడా అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు