అమ్మాయిలు అందుకుంటారా?

దేశానికి తొలి అండర్‌-19 ప్రపంచకప్‌ అందించే అవకాశం భారత అమ్మాయిల ముందు నిలిచింది. చక్కటి ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత బృందం ఆదివారం ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతోంది.

Updated : 29 Jan 2023 05:07 IST

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే
ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ
సా. 5.15 నుంచి

దేశానికి తొలి అండర్‌-19 ప్రపంచకప్‌ అందించే అవకాశం భారత అమ్మాయిల    ముందు నిలిచింది. చక్కటి ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత బృందం ఆదివారం ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతోంది. సీనియర్‌ జట్టు సభ్యురాలైన షెఫాలి వర్మ ఈ టోర్నీలో సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. కెప్టెన్‌ కూడా అయిన షెఫాలి ఆల్‌రౌండ్‌ మెరుపులతో జట్టును ముందుండి నడిపిస్తూ ఫైనల్‌ వరకు తీసుకొచ్చింది. బ్యాటింగ్‌లో శ్వేత సెహ్రావత్‌, సౌమ్య తివారి.. బౌలింగ్‌లో పర్శవి చోప్రా, తితాస్‌, మన్నత్‌ కశ్యప్‌ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇంగ్లాండ్‌.. సూపర్‌-6లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానం సాధించింది. పిచ్‌ ఆ జట్టుకే అనుకూలం. మరి ఇంగ్లిష్‌ జట్టు విసిరే సవాలును షెఫాలి సేన ఎలా కాచుకుని కప్పు గెలుస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని