టైటిల్‌పై భారత అమ్మాయిల గురి

మరి కొన్ని రోజుల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వెళ్లాలనుకుంటున్న భారత్‌.. ముక్కోణపు టీ20 సిరీస్‌ టైటిల్‌పై గురిపెట్టింది.

Published : 02 Feb 2023 02:49 IST

దక్షిణాఫ్రికాతో ఫైనల్‌ నేడు

ఈస్ట్‌ లండన్‌: మరి కొన్ని రోజుల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వెళ్లాలనుకుంటున్న భారత్‌.. ముక్కోణపు టీ20 సిరీస్‌ టైటిల్‌పై గురిపెట్టింది. గురువారం జరిగే ఫైనల్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో 1-4తో ఘోర పరాజయం చవిచూసిన భారత్‌.. ముక్కోణపు సిరీస్‌లో మూడు విజయాలతో గొప్పగా పుంజుకుంది. ఈ నెల 10న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు ముందు ముక్కోణపు సిరీస్‌ను ఘనంగా ముగించాలని భారత్‌ పట్టుదలగా ఉంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం సాధించింది. ఆ జట్టుతో రెండో మ్యాచ్‌ వర్షార్పణమైంది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలుపొందింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు