ఫిడే గ్రాండ్‌ప్రి బరిలో హంపి, హారిక

ఫిడే మహిళల చెస్‌ గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు.

Published : 28 Apr 2024 01:49 IST

దిల్లీ: ఫిడే మహిళల చెస్‌ గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. త్వరలో ఆరంభమయ్యే ఈ ఈవెంట్లో మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి కూడా ఈ ఆడనుంది. ఆరు టోర్నీలుగా ఈ గ్రాండ్‌ప్రి సిరీస్‌ జరగనుంది. ఇప్పటికే  14 మంది జీఎంలు ఈ సిరీస్‌లో ఆడేందుకు అర్హత సాధించారు. మరో ఆరుగురిని నిర్వాహకులు ప్రతిపాదించనున్నారు. ఈ టోర్నీలో టాన్‌ జాంగ్‌యీ, అలెగ్జాండ్రా కొస్తెనిక్‌, మరియా ముజ్‌చుక్‌, కేథరినా లాగ్నో, అనా ముజ్‌చుక్‌ లాంటి టాప్‌ ప్లేయర్లు పోటీలో ఉన్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జువెన్‌ జువాన్‌ ఈ సిరీస్‌ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో  సారా ఖాదెమ్‌ (ఇరాన్‌) ఆడనుంది. గత ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్‌తో పోలిస్తే నిర్వాహకులు రెండు కీలక మార్పులు చేశారు. టోర్నీలను నాలుగు నుంచి ఆరుకి.. క్రీడాకారులను 14 నుంచి 20కి పెంచారు. ఆరు టోర్నీల్లో ఒక్కొక్కరూ మూడింట్లో మాత్రమే పాల్గొంటారు. సిరీస్‌ ముగిసిన తర్వాత టాప్‌-2 ప్లేయర్లు 2026 క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని