భారత్‌కు ఏడు స్వర్ణాలు

ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి  (54 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), ఆకాశ్‌ గోర్కా (60 కేజీలు), పూనమ్‌ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్‌ (75 కేజీలు), విశ్వనాథ్‌ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు.

Updated : 09 May 2024 00:50 IST

అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి  (54 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), ఆకాశ్‌ గోర్కా (60 కేజీలు), పూనమ్‌ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్‌ (75 కేజీలు), విశ్వనాథ్‌ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. ప్రీతి 3-0తో జజరోవాను చిత్తు చేయగా.. విశ్వనాథ్‌ అంతే తేడాతో యెనర్‌ను ఓడించాడు. సబెర్‌పై నిఖిల్‌.. రుస్లాన్‌పై ఆకాశ్‌ గెలిచారు. అనెల్‌పై 4-1తో పూనమ్‌.. తుర్సెన్‌బెక్‌పై ప్రాచి అంతే తేడాతో గెలిచారు. వీళ్లందరూ కజకిస్థాన్‌ ప్రత్యర్థులనే ఓడించారు. ముస్కాన్‌ 3-2తో ఉజ్బెకిస్థాన్‌ అమ్మాయి జొకిరోవాపై నెగ్గింది. ప్రీతి మలిక్‌ (67 కేజీలు), గుడ్డి (48 కేజీలు), తమన్నా (50 కేజీలు), స్నేహ్‌ (70 కేజీలు), అల్ఫియా (81 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. ఈ టోర్నీలో మొత్తం 43 పతకాలతో (12 స్వర్ణ, 14 రజత, 17 కాంస్యాలు) భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య కజకిస్థాన్‌ (48) అగ్రస్థానం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు