కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో.. మరో జట్టు శ్రీలంకలో
న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఇంకో మూడు వారాల్లో బ్రిటన్‌కు బయల్దేరబోతోంది విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు. జూన్ 18-22
జులైలో టీ20, వన్డే సిరీస్‌కు బీసీసీఐ సన్నాహాలు
కోల్‌కతా: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఇంకో మూడు వారాల్లో బ్రిటన్‌కు బయల్దేరబోతోంది విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు. జూన్ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక కోహ్లీసేన అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడాక, ఆగస్టులో ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, జులైలో టీమ్‌ఇండియా టీ20, వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించబోతుండటం విశేషం. ఇంగ్లాండ్‌లో ఉన్న కోహ్లీసేన.. మధ్యలో శ్రీలంకలో ఎలా పర్యటిస్తుంది అనే సందేహం తలెత్తడం సహజం. అయితే లంకకు వెళ్లబోయేది వేరే భారత జట్టు కావడమే ఇక్కడ విశేషం. ఇంగ్లాండ్ పర్యటనలో భాగమైన ఆటగాళ్లను మినహాయించి పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టులతోనే మరో జట్టును ఎంపిక చేసి లంకకు పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు. ఈ పర్యటనలో లంకతో టీమ్‌ఇండియా అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ లాంటి సీనియర్లకు తోడు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, దేవ్‌దత్ పడిక్కల్, రాహుల్ తెవాతియా లాంటి కుర్రాళ్లను ఈ పర్యటనకు పంపే అవకాశముంది. గాయం నుంచి కోలుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా లంకకు వెళ్తాడు. వీళ్లందరికీ టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్
-
Sports News
IND vs AUS: స్టీవ్ స్మిత్‌ని ఆ స్పిన్నర్ ఇబ్బందిపెడతాడు: ఇర్ఫాన్ పఠాన్
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?