David Warner:తప్పించి.. ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు?

ఉన్నపళంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా తనను తప్పించడం.. ఆ తర్వాత తుది జట్టులోనూ చోటు ఇవ్వకపోవడం ఎంతో బాధించిందని ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వెల్లడించాడు. గతేడాది ఐపీఎల్‌

Updated : 08 Jan 2022 07:31 IST

సన్‌రైజర్స్‌ తీరుపై వార్నర్‌

మెల్‌బోర్న్‌: ఉన్నపళంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా తనను తప్పించడం.. ఆ తర్వాత తుది జట్టులోనూ చోటు ఇవ్వకపోవడం ఎంతో బాధించిందని ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వెల్లడించాడు. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ఆరు మ్యాచ్‌ల్లో జట్టు ఒక్క విజయమే సాధించడంతో కెప్టెన్‌గా వార్నర్‌పై వేటు వేసిన యాజమాన్యం విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం తుది జట్టు నుంచి అతణ్ని తప్పించారు. 2016లో జట్టును విజేతగా నిలిపిన వార్నర్‌ ఈ పరిణామాలతో ఫ్రాంఛైజీతో బంధం తెంచుకున్నాడు. ‘‘జట్టు కోసం ఎంతో చేసిన ఓ కెప్టెన్‌ను తప్పించి, ఆ తర్వాత మ్యాచ్‌లోనూ ఆడించకపోతే యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇచ్చినట్లు? బృందంలోని మిగతా వాళ్లు ఏమనుకుంటారు? ‘ఓహ్‌.. ఇలా నాకూ జరగవచ్చు’ అని ఇతర ఆటగాళ్లు అనుకుంటుండడం ఎక్కువగా బాధించింది. ఏది ఏమైనా చివరకు ప్రతి దాన్నీ ఆమోదించాల్సిందే. ఒకవేళ చర్చించాలి అంటే నేరుగా నాతోనే మాట్లాడాల్సింది. నేనేమీ వాళ్లను కొరికేవాణ్ని కాదు. జట్టులోకి నన్ను ఎందుకు తీసుకోవడం లేదో కూర్చుని అర్థం చేసుకునేవాణ్ని. నా నిష్క్రమణ అభిమానులకు బాధ కలిగిస్తుందని తెలుసు. సన్‌రైజర్స్‌తో నేను చాలా కాలం పాటు ఉన్నా. ఆట పట్ల ఎంతో అంకితభావంతో ఉండే నన్ను కెప్టెన్‌గా తొలగించడం బాధ కలిగించింది. నాకు వీలైన ప్రతి మార్గంలో అభిమానులను కలిసేందుకు ప్రయత్నించా’’  అని వార్నర్‌ అనాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని