ప్రిక్వార్టర్స్‌లో సింధు

సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ సింధు 21-9, 21-9తో తాన్యా హేమంత్‌పై

Published : 20 Jan 2022 04:27 IST

సయ్యద్‌ మోదీ టోర్నీ

లఖ్‌నవూ: సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ సింధు 21-9, 21-9తో తాన్యా హేమంత్‌పై విజయం సాధించింది. సామియా ఇమాద్‌ ఫారూఖీ 17-21, 21-11, 21-10తో శ్రుతి ముందాడపై, కనిక కన్వల్‌ 21-15, 16-21, 21-6తో దిశ గుప్తా (అమెరికా)పై, కృతి భరద్వాజ్‌ 21-6, 21-4తో తనిష్క్‌ మామిళ్లపల్లిపై, ప్రేరణ నీలూరి 21-3, 21-4తో గద్దె రుత్విక శివానిపై, స్మిత్‌ తోష్నివాల్‌ 21-13, 21-10తో పూర్వపై, సాయి ఉత్తేజితరావు చుక్కా 21-9, 21-12తో అంజన కుమారిపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో కౌశల్‌ 14-21, 21-11, 21-16తో హెంగ్‌ జేసన్‌ (సింగపూర్‌)పై, చిరాగ్‌ సేన్‌ 21-9, 21-6తో అన్షల్‌యాదవ్‌పై, మిథున్‌ మంజునాథ్‌ 21-15, 21-9తో ఆలాప్‌ మిశ్రాపై గెలుపొందారు.మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ 21-1, 21-4తో మాహెక్‌- సౌమ్యపై నెగ్గారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని