ఐపీఎల్‌కు రుణపడి ఉన్నా..

ఐపీఎల్‌కు తాను చాలా రుణపడి ఉన్నానని ఆస్ట్రేలియా విధ్వంసక వీరుడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. ఈ లీగ్‌ తన జీవితంలో ఎంతో మార్పును తెచ్చిందని చెప్పాడు. ‘‘ఐపీఎల్‌ నా జీవితంలో

Published : 03 Feb 2022 03:51 IST

సిడ్నీ: ఐపీఎల్‌కు తాను చాలా రుణపడి ఉన్నానని ఆస్ట్రేలియా విధ్వంసక వీరుడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. ఈ లీగ్‌ తన జీవితంలో ఎంతో మార్పును తెచ్చిందని చెప్పాడు. ‘‘ఐపీఎల్‌ నా జీవితంలో చాలా గొప్ప మార్పులు తెచ్చింది. నా హీరోలు కొందరిని కలవగలిగాను. నాకు ఎంతో నచ్చిన ఆటగాళ్లతో కలిసి ఆడగలిగా. ఇష్టపడే ఆటగాళ్లతో పోటీపడ్డా’’ అని అన్నాడు. అనేకసార్లు భారత్‌కు రావడం ద్వారా సంస్కృతులపై అవగాహన పెరిగిందని మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. ‘‘ఐపీఎల్‌కు నేను చాలా రుణపడి ఉన్నా. అంతర్జాతీయ క్రికెటర్‌గా అది నాకెంతో ఉపయోగపడింది. ఈ లీగ్‌ వల్లే భిన్న పరిస్థితులకు అలవాటు పడ్డా’’ అని చెప్పాడు. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని