David Warner: పంత్‌ నుంచి ఆ షాట్లు నేర్చుకుంటా: వార్నర్‌

దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ నుంచి ఒక్క చేత్తో షాట్లు ఆడడం ఎలాగో నేర్చుకుంటానని అంటున్నాడు డేవిడ్‌ వార్నర్‌. 2009లో దిల్లీతోనే భారత్‌లో టీ20 క్రికెట్‌ లీగ్‌ కెరీర్‌ను ఆరంభించిన అతడు..

Updated : 07 Apr 2022 07:42 IST

ముంబయి: దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ నుంచి ఒక్క చేత్తో షాట్లు ఆడడం ఎలాగో నేర్చుకుంటానని అంటున్నాడు డేవిడ్‌ వార్నర్‌. 2009లో దిల్లీతోనే భారత్‌లో టీ20 క్రికెట్‌ లీగ్‌ కెరీర్‌ను ఆరంభించిన అతడు.. మధ్యలో హైదరాబాద్‌కు ఆడి, ఈ సంవత్సరమే ఆ జట్టులోకి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం గుజరాత్‌తో మ్యాచ్‌ నుంచి అతడు జట్టుకు అందుబాటులో ఉంటాడు. ‘‘రిషబ్‌ పంత్‌ నుంచి ఒంటి చేత్తో ఎలా షాట్లు ఆడాలో నేర్చుకోవాలనుకుంటున్నా. అతడు కుర్రాడు. ఇప్పుడిప్పుడే నాయకత్వాన్ని వంటబట్టించుకుంటున్నాడు. పంత్‌ భారత జట్టులో అంతర్భాగం కూడా. అతడితో కలిసి బ్యాటింగ్‌ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని వార్నర్‌ ఓ ప్రకటనలో చెప్పాడు. దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేయడంపైనా అతడు మాట్లాడాడు. ‘‘దిల్లీ కోచ్‌గా రికీ బాగానే విజయవంతమయ్యాడు. కెప్టెన్‌గా అతడు ఆస్ట్రేలియాను గొప్పగా నడిపించాడు. ఇప్పుడు కోచ్‌గా కూడా చాలా గౌరవాన్ని పొందుతున్నాడు. అతడితో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నా’’ అని వార్నర్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని