Pat Cummins: కమిన్స్‌ ఇంటికి.. ఆస్ట్రేలియాకు పయనం..

కోల్‌కతా స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ టీ20లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తుంటి గాయం కారణంగా అతడు టీ20 లీగ్‌ వీడి స్వదేశం వెళ్లిపోయాడు. గాయం చిన్నదే అయినప్పటికీ వచ్చే

Updated : 14 May 2022 06:56 IST

మెల్‌బోర్న్‌: కోల్‌కతా స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ టీ20లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తుంటి గాయం కారణంగా అతడు టీ20 లీగ్‌ వీడి స్వదేశం వెళ్లిపోయాడు. గాయం చిన్నదే అయినప్పటికీ వచ్చే నెల శ్రీలంక సిరీస్‌కు పూర్తి సిద్ధంగా ఉండటం కోసం అతడు మిగతా మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్‌ టెస్టు జట్టుకు కమిన్స్‌ కెప్టెన్‌. శుక్రవారం కమిన్స్‌ ఆస్ట్రేలియా పయనమయ్యాడని కోల్‌కతా ఫ్రాంఛైజీ ప్రకటించింది. వేలంలో రూ. 7.25 కోట్లకు  కోల్‌కతా కమిన్స్‌ను సొంతం చేసుకుంది. చివరగా ముంబయితో మ్యాచ్‌లో అతడు 3 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌ అనంతరం కుడి తుంటికి ఎమ్‌ఆర్‌ఐ నిర్వహించగా చిన్నపాటి గాయమైందని తేలింది. శనివారం హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని