గావస్కర్‌ వీడియోలు చూసి నేర్చుకోండి

సునీల్‌ గావస్కర్‌ ఎత్తు తక్కువ అయినా హోల్డింగ్‌, రాబర్ట్స్‌, మాల్కం మార్షల్‌, హ్యాడ్లీ వంటి మేటి ఫాస్ట్‌బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడని, ఈతరం బ్యాట్స్‌మెన్‌ అతడి వీడియోలు చూసి నేర్చుకోవాలని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు జావేద్‌ మియందాద్‌ అన్నాడు.

Published : 29 May 2022 02:21 IST

కరాచి: సునీల్‌ గావస్కర్‌ ఎత్తు తక్కువ అయినా హోల్డింగ్‌, రాబర్ట్స్‌, మాల్కం మార్షల్‌, హ్యాడ్లీ వంటి మేటి ఫాస్ట్‌బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడని, ఈతరం బ్యాట్స్‌మెన్‌ అతడి వీడియోలు చూసి నేర్చుకోవాలని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు జావేద్‌ మియందాద్‌ అన్నాడు. ‘‘ఆ ఎత్తుతో గావస్కర్‌ ప్రపంచ వ్యాప్తంగా ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అతడి నిలకడ, ప్రదర్శన చిరస్మరణీయం’’ అని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు విడుదల చేసిన వీడియోలో మియందాద్‌ చెప్పాడు. ‘‘ఈతరం ఆటగాళ్లు గావస్కర్‌ వీడియోలు చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఎత్తు తక్కువే అయినా భీకర ఫాస్ట్‌బౌలర్లను తట్టుకుని నిలిచాడు. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌,   పాకిస్థాన్‌ జట్లలో భీకర ఫాస్ట్‌ బౌలర్లు ఉన్న తరంలో అతడు ఆడాడు’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని