డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ సిద్ధం

ఒలింపిక్‌ జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించాక నీరజ్‌ చోప్రా స్థాయి అమాంతం పెరిగిపోయింది. అలాగే అంచనాలు కూడా. అతడూ నిరాశపరచట్లేదు. అంచనాలకు తగ్గట్లే ప్రదర్శన చేస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత బరిలోకి దిగిన తొలిసారి, జూన్‌ 14న పావో నుర్మి క్రీడల్లో మెరిశాడు

Published : 26 Jun 2022 01:52 IST

దిల్లీ: ఒలింపిక్‌ జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించాక నీరజ్‌ చోప్రా స్థాయి అమాంతం పెరిగిపోయింది. అలాగే అంచనాలు కూడా. అతడూ నిరాశపరచట్లేదు. అంచనాలకు తగ్గట్లే ప్రదర్శన చేస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత బరిలోకి దిగిన తొలిసారి, జూన్‌ 14న పావో నుర్మి క్రీడల్లో మెరిశాడు. 89.30 మీటర్లు త్రో చేసిన అతడు.. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ రజతం చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత జూన్‌ 18న కుర్తేన్‌ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. ఈ రెండు క్రీడల్లోనూ నీరజ్‌.. ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా)ను ఓడించాడు. జోరు మీదున్న నీరజ్‌ ఇప్పుడు సీజన్‌లో తన తొలి డైమండ్‌ లీగ్‌ మీట్‌కు సన్నద్ధమయ్యాడు. స్టాక్‌హోమ్‌లో ఈ నెల 30న మీట్‌ జరుగుతుంది. అమెరికాలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు ముందు నీరజ్‌కు ఇదే అతి పెద్ద ఈవెంట్‌. మేటి జావెలిన్‌ త్రోయర్లు పోటీపడుతోన్న డైమండ్‌ లీగ్‌లో అతడు గట్టి పోటీని ఎదుర్కోనున్నాడు. పీటర్స్‌, ఒలింపిక్స్‌లో రజత విజేత జాకబ్‌ వద్లేచ్‌ (చెక్‌), కాంస్య విజేత వెస్లీ పోటీలో ఉన్నారు. పీటర్స్‌.. దోహా డైమండ్‌ లీగ్‌లో 93.07 మీటర్లు విసిరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని