Rahul Dravid: అప్టన్‌తో చాలా ప్రయోజనం: ద్రవిడ్‌

ప్యాడీ అప్టన్‌ విజ్ఞాన గని అని, క్రికెటర్ల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన పరిస్థితుల్లో అతడెంతో ఉపయోగపడతాడని టీమ్‌ ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.

Updated : 28 Jul 2022 06:06 IST

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ప్యాడీ అప్టన్‌ విజ్ఞాన గని అని, క్రికెటర్ల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన పరిస్థితుల్లో అతడెంతో ఉపయోగపడతాడని టీమ్‌ ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ‘‘చాలా క్రికెట్‌ ఆడుతున్న ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా ముఖ్యం. అప్టన్‌ వంటి పరిజ్ఞానమున్న వ్యక్తి జట్టుతో ఉండడం భారత జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. అతడు మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ జట్టుతో చేరడం మా అదృష్టం. 2011లో భారత జట్టులో కలిసి పనిచేసిన అనుభవం అతడి ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఐపీఎల్‌లో, టీమ్‌ఇండియా తరఫున పని చేసిన అతడికి చాలా మంది భారత క్రికెటర్లపై అవగాహన ఉంది. మన సంప్రదాయం కూడా అప్టన్‌కు బాగా తెలుసు. భారత జట్టు ఎలా పనిచేస్తుందో తెలుసు. మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌గా సరిగ్గా సరిపోతాడు. టీ20 ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేయాలనుకుంటున్న మేం అతడి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి’’ అని ద్రవిడ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని