CWG 2022: పసిడి పోరుకు సింధు, లక్ష్యసేన్‌

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్‌ పతకం ఖాయం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లి పసిడి పోరుకు సిద్ధమయ్యారు.

Updated : 08 Aug 2022 04:03 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్‌ పతకం ఖాయం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లి పసిడి పోరుకు సిద్ధమయ్యారు. సెమీస్‌లో సింధు 21-19, 21-17తో యో జియా మిన్‌ (సింగపూర్‌)పై విజయం సాధించింది. 2014 క్రీడల్లో కాంస్యం, 2018లో రజతం గెలిచిన సింధుకు స్వర్ణం గెలవడానికి ఇదే మంచి అవకాశం. పురుషుల సెమీస్‌లో లక్ష్యసేన్‌ 21-10, 18-21, 21-16తో జియా హెంగ్‌ (సింగపూర్‌)పై నెగ్గాడు. సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి పతకం ఖాయం చేశారు. పురుషుల డబుల్స్‌లో ఈ జోడీ ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ 21-6, 21-15తో చెన్‌ పెంగ్‌-తిన్‌ కియాన్‌ (మలేసియా)పై విజయం సాధించారు. సింగిల్స్‌ సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌.. కాంస్య పోరులో 21-15, 21-18తో జియా హెంగ్‌ (సింగపూర్‌)పై గెలిచాడు. డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ 21-6, 21-15తో చెన్‌ పెంగ్‌-తిన్‌ కియాన్‌ (మలేసియా)పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలి జోడీ 21-15, 21-18తో చెన్‌ సుయాన్‌, గ్రొనియా (ఆస్ట్రేలియా)పై గెలిచి కాంస్యం సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని