మహరాజాస్‌ కెప్టెన్‌గా గంగూలీ

మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఓ జట్టును నడిపించనున్నాడు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ ఆరంభానికి ముందు ఓ ప్రత్యేక మ్యాచ్‌ను

Published : 13 Aug 2022 03:07 IST

దిల్లీ: మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఓ జట్టును నడిపించనున్నాడు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ ఆరంభానికి ముందు ఓ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఇండియా మహరాజాస్‌ జట్టు వరల్డ్‌ జెయింట్స్‌ జట్టును ఢీకొననుంది. ఇండియా జట్టుకు గంగూలీ, ప్రపంచ జట్టుకు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహించనున్నారు. సెప్టెంబర్‌ 16న ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 17న ఆరంభం కానున్న లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ సీజన్‌-2లో నాలుగు జట్లు తలపడనున్నాయి. ఈ లీగ్‌లో 22 రోజుల్లో 15 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇండియా మహరాజాస్‌ జట్టు: గంగూలీ (కెప్టెన్‌), సెహ్వాగ్‌, అజయ్‌ జడేజా, కైఫ్‌, యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, బద్రినాథ్‌, పార్థివ్‌ పటేల్‌, స్టువర్ట్‌ బిన్నీ, శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా, అశోక్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితీందర్‌ సింగ్‌ సోథీ
వరల్డ్‌ జెయింట్స్‌ జట్టు: మోర్గాన్‌ (కెప్టెన్‌, ఇంగ్లాండ్‌), లెండిల్‌ సిమన్స్‌ (వెస్టిండీస్‌), గిబ్స్‌ (దక్షిణాఫ్రికా), కలిస్‌ (దక్షిణాఫ్రికా), జయసూర్య (శ్రీలంక), ప్రయర్‌ (ఇంగ్లాండ్‌), మెక్‌కలమ్‌ (న్యూజిలాండ్‌), జాంటీ రోడ్స్‌ (దక్షిణాఫ్రికా), మురళీధరన్‌ (శ్రీలంక), స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా), మసకద్జ (జింబాబ్వే), మొర్తజా (బంగ్లాదేశ్‌), అస్గర్‌ అఫ్గాన్‌ (అఫ్గానిస్థాన్‌), మిచెల్‌ జాన్సన్‌ (ఆస్ట్రేలియా), బ్రెట్‌లీ (ఆస్ట్రేలియా), కెవిన్‌ ఒబ్రైన్‌ (ఐర్లాండ్‌), రామ్‌దిన్‌ (వెస్టిండీస్‌).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని