పుజారా 79 బంతుల్లో 107

చెతేశ్వర్‌ పుజారా.. ఈ పేరు వింటే అతడి నెమ్మదైన బ్యాటింగే గుర్తుకొస్తుంది. క్రీజులో గంటల తరబడి పాతుకుపోయే ఆ టెస్టు స్పెషలిస్టే జ్ఞాపకమొస్తాడు! అలాంటి పుజారా విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Published : 14 Aug 2022 04:03 IST

దిల్లీ: చెతేశ్వర్‌ పుజారా.. ఈ పేరు వింటే అతడి నెమ్మదైన బ్యాటింగే గుర్తుకొస్తుంది. క్రీజులో గంటల తరబడి పాతుకుపోయే ఆ టెస్టు స్పెషలిస్టే జ్ఞాపకమొస్తాడు! అలాంటి పుజారా విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. లండన్‌ వన్డే కప్‌లో భాగంగా ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వార్విక్‌షైర్‌పై 311 పరుగుల ఛేదనలో ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌ మెరుపు శతకం బాదాడు. చెలరేగి ఆడిన అతడు 79 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. పేసర్‌ లిమ్‌ వేసిన 45వ ఓవర్లో పుజారా 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు రాబట్టడం విశేషం. 49వ ఓవర్‌ తొలి బంతికి పుజారా ఔట్‌ కావడంతో.. చివరికి ససెక్స్‌ 7 వికెట్లకు 306 పరుగులే చేసింది. వార్విక్‌షైర్‌ తరఫున ఆడిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య (3/51) విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు వార్విక్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో రాబర్ట్‌ యాట్స్‌ (114) సెంచరీ చేయగా.. విల్‌ రోడ్స్‌ (76), బర్జెస్‌ (58) రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని