Kapildev: వాళ్లు కేకు మీద చెర్రీలాంటోళ్లు

ఆల్‌రౌండర్లు కేకు మీద ఉండే చెర్రీలాంటోళ్లు అని, జట్టుకు వాళ్ల అవసరం ఎంతో ఉంటుందని భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘హార్దిక్‌ లాంటి ఆల్‌రౌండర్లు ఉండడం జట్టుకు లాభం.

Updated : 02 Sep 2022 09:14 IST

దిల్లీ: ఆల్‌రౌండర్లు కేకు మీద ఉండే చెర్రీలాంటోళ్లు అని, జట్టుకు వాళ్ల అవసరం ఎంతో ఉంటుందని భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘హార్దిక్‌ లాంటి ఆల్‌రౌండర్లు ఉండడం జట్టుకు లాభం. వాళ్ల కోటా ఓవర్లు పూర్తి చేయడమే కాకుండా ఉత్తమంగా బ్యాటింగ్‌ చేసే హార్దిక్‌, జడేజా జట్టులో ఉన్నారు. వాళ్లు గొప్ప అథ్లెట్లు కూడా. ఏ ఆల్‌రౌండరైనా జట్టుకు కేకు మీద ఉండే చెర్రీ లాంటివాడు. హార్దిక్‌ మనల్ని గర్వపడేలా చేశాడు. కానీ ఒక్క విషయం ఏమిటంటే.. అతను తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సామర్థ్యాలున్న ఆటగాడు గాయపడితే అప్పుడు జట్టు మొత్తం గాయపడినట్లే. అతని నైపుణ్యాలపై ఎవరికీ అనుమానం లేదు. కానీ కొన్నిసార్లు అతని గాయాల పట్ల ఆందోళన చెందుతున్నా’’ అని ఈ మాజీ ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. తాజాగా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో పోరులో అదరగొట్టిన హార్దిక్‌ (3/25; 33 నాటౌట్‌) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని