ద్రవిడ్‌ను దాటేశాడు..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి ఖాతాలో మరో ఘనత. అతడు అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రాహుల్‌ (24,064, 504 మ్యాచ్‌లు) ద్రవిడ్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. 33 ఏళ్ల కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 471 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 24078 పరుగులు చేశాడు.

Published : 27 Sep 2022 02:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి ఖాతాలో మరో ఘనత. అతడు అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రాహుల్‌ (24,064, 504 మ్యాచ్‌లు) ద్రవిడ్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. 33 ఏళ్ల కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 471 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 24078 పరుగులు చేశాడు. సచిన్‌ (34,357, 664 మ్యాచ్‌లు) మాత్రమే విరాట్‌ కన్నా ముందున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 71 శతకాలు, 125 అర్ధశతకాలు సాధించాడు.

విరాట్‌.. గంటన్నర ముందే!: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి. ఇటీవలే ఆసియా కప్‌లో సెంచరీతో జోరుమీదున్నాడు. అంతటి ఆటగాడు ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమయ్యాడో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు! శుక్రవారం రాత్రి నాగ్‌పుర్‌లో రెండో టీ20 మ్యాచ్‌లో అర్ధ రాత్రి వరకు మైదానంలో గడిపిన టీమ్‌ఇండియా.. శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆటగాళ్లంతా బాగా అలసిపోవడంతో అందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం మ్యాచ్‌ రోజు 5.30 గంటలకు టీమ్‌ఇండియా ఉప్పల్‌ స్టేడియంలో అడుగుపెట్టింది. అయితే విరాట్‌ మాత్రం 4 గంటలకల్లా స్టేడియానికి వచ్చేశాడు. త్రోలు వేయడానికి బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌తో పాటు మరో ఇద్దరిని వెంట తెచ్చుకున్నాడు. జట్టు వచ్చేలోపు గంటన్నర పాటు నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేశాడు. టీమ్‌ఇండియా స్టేడియానికి వచ్చిన తర్వాత కూడా అరగంట పాటు కోహ్లి నెట్స్‌లో సాధన కొనసాగించాడు. ఫలితమే కోహ్లి (63; 48 బంతుల్లో 3×4, 4×6) కీలక ఇన్నింగ్స్‌. సుమారు 14 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న కోహ్లి అంకితభావానికి ఇదే నిదర్శనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని